ప్రస్తుతం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి “ఓ బేబీ” మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “ఓ బేబీ” చిత్రం విడుదలైన మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్ళవైపుగా దూసుకుపోతుంది. హీరోయిన్ సమంత,రావు రమేష్,రాజేంద్రప్రసాద్ ల అద్భుత నటనతో పాటు, నందిని రెడ్డి టేకింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. డైరక్టర్ నందినిరెడ్డి పై ప్రేక్షకులతో పాటు అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఓ బేబీ’ సినిమాను, నటీనటులతో పాటు దర్శకురాలు నందిని రెడ్డి ని ప్రశంసించడం జరిగింది. అల్లు అర్జున్ తమ సినిమా పట్ల పాజిటివ్ గా స్పందించినందుకు గాను నందిని ట్విట్టర్ ద్వారా కృతజ్ఞత తెలియజేశారు. ఓ బేబీ చిత్రాన్ని అభినందించినందుకు కృతజ్ఞతలు, మీలాంటి నటులు మంచి చిత్రాలు తీయడానికి స్ఫూర్తి ఇస్తున్నారు. మీరు బెస్ట్ సర్ అని ట్వీట్ చేశారు.
Thank you @alluarjun for always motivating me and believing I can be better ???…. your words about #OhBaby made my day…. you are the best Bunny ???? pic.twitter.com/YmUUpwji8N
— Baby Reddy (@nandureddy4u) July 8, 2019