‘రాజుగారి గది’కి వెళ్ళమంటున్న హీరోయిన్స్…!

‘రాజుగారి గది’కి వెళ్ళమంటున్న హీరోయిన్స్…!

Published on Jul 8, 2019 1:16 PM IST

యాంకర్ కమ్ దర్శకుడు ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్,కామెడీ చిత్రం ‘ రాజుగారి గది-3 ‘. విజయవంతమైన రాజుగారి గది సిరీస్ కి కొనసాగింపుగా తెరకెక్కనుంది. ఐతే ఈ చిత్రం మొదటి భాగంలో పూర్ణా, రెండవ భాగంలో సమంత హార్రర్ పాత్రలలో కనిపించి మెప్పించారు. ఇక మూడవ భాగంగా తెరకెక్కనున్న “రాజుగారి గది3″లో మొదటగా తమన్నా తో ఒప్పదం చేసుకోవడం, ఆమె సినిమా పూజా కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరిగింది. ఐతే స్క్రిప్ట్ విషయంలో ఓంకార్ మార్పులు చేయడంతో ఆమె ఈ మూవీ నుండి బయటకి వచ్చేశారు. ఆతరువాత కాజల్ ఈ పాత్ర చేయడానికి అంగీకరించారని వార్తలు వచ్చాయి. ఐతే రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో ఆమె కూడా ఈ మూవీ చేయడం లేదని తెలుస్తుంది.

అలా దర్శకుడు ఓంకార్ కి “రాజుగారి గది 3″కోసం హీరోయిన్ దొరకడం లేదు. ఐతే తాజాగా ” ఉయ్యాలా..జంపాలా”‘,” ఎక్కడికి పోతావు చిన్నవాడా”వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అవికా గౌర్ ను తీసుకోవాలని ఓంకార్ ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. మరి అవికా గౌర్ అయినా రాజుగారి గది లోకి వెళ్ళడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు