కుడి ఎడమైతే వెబ్ సిరీస్ సక్సెస్ పై డైరెక్టర్ రెస్పాన్స్!

Published on Jul 19, 2021 9:34 pm IST

పవన్ కుమార్ దర్శకత్వం లో అమలా పాల్, రాహుల్ విజయ్, రవి ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. లూసియా మరియు యూ టర్న్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ ఇప్పుడు కుడి ఎడమైతే వెబ్ సిరీస్ తో కూడా ఆకట్టుకున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో దర్శకుడు పవన్ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

అయితే 45 రోజుల్లో 8 ఎపిసొడ్ లను ఎలా షూట్ చేశారు అని ఆలోచిస్తున్నారా అంటూ చెప్పుకొచ్చారు. అయితే వాళ్లు ఉపయోగించిన ఒక యాప్ ను వీడియో రూపం లో పెట్టారు. అందుకు సంబంధించిన లింక్ ను షేర్ చేశారు పవన్. అయితే ఆహా వీడియో లో స్ట్రీమ్ అవుతున్న ఈ సీరీస్ పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :