“హను మాన్” డిజిటల్ ప్రీమియర్ పై ప్రశాంత్ వర్మ అప్డేట్!

“హను మాన్” డిజిటల్ ప్రీమియర్ పై ప్రశాంత్ వర్మ అప్డేట్!

Published on Mar 11, 2024 6:05 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదిక గా ఇందుకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు.

త్వరలో హను మాన్ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ పై ప్రకటన ఇస్తాం అని అన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు