‘లవ్ స్టోరీ’ సెట్ లో బర్త్ డే సెలెబ్రేషన్స్ !

‘లవ్ స్టోరీ’ సెట్ లో బర్త్ డే సెలెబ్రేషన్స్ !

Published on Feb 5, 2020 3:00 AM IST

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు శేఖర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం సెట్ లో కేక్ కట్ చేసి శేఖర్ కమ్ముల పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసింది. ప్రస్తుతం ఈ బర్త్ డే ఫోటోలు షోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక ఏప్రిల్ 2న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. బలమైన కథలతో సినిమాలు తీసే డైరెక్టర్ గా మంచి పేరు ఉన్న శేఖర్ కమ్ముల.. ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ తరువాత చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది.

కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఏషియన్ వంటి పెద్ద కంపెనీ నిర్మిస్తుండటం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు