‘అందరివాడు’ ఆ డైరెక్టర్ ని ఆదుకుంటాడా?

Published on Feb 26, 2020 9:48 pm IST

ఒకప్పుడు మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా వరుస అవకాశాలతో దూసుకుపోయిన దర్శకుడు శ్రీను వైట్ల విజయాలు లేక సతమతమవుతున్నాడు. ఆయన 2013లో ఎన్టీఆర్ తో చేసిన బాద్షా తరువాత హిట్ కొట్టలేదు. ఆ చిత్రం తరువాత శ్రీను వైట్ల చేసిన నాలుగు సినిమాలు పరాజయం పొందాయి. దీనితో ఆయన స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ నుండి వెళ్లిపోయారు. ఐతే మంచి హిట్ మూవీ ఇచ్చి మళ్ళీ టాలీవుడ్ లో బిజీ కావాలని ఈ దర్శకుడు చూస్తున్నాడు.

కాగా ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవిని ప్రసన్నం చేసుకొనే పనిలో ఉన్నారని సమాచారం. కొరటాల శివ షూటింగ్ సెట్స్ లో ఉన్న చిరుని కలవడంతో పాటు ఆయనకు కొన్ని కథలు వినిపించాడట. గతంలో చిరంజీవితో అందరివాడు చిత్రాన్ని శ్రీను వైట్ల తీశారు. చిరంజీవి డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. మరి భారీ చిత్రాలు చేస్తున్న చిరు డైరెక్టర్ శ్రీను వైట్లకు అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More