శ్రీను వైట్లకు ఓ హీరో కావాలట..!

Published on Feb 27, 2020 8:36 pm IST

చిత్ర పరిశ్రమలో సక్సెస్ అనేది చాల ఇంపార్టెంట్. ఇక వరుస ఫెయిల్యూర్స్ ఎదురైతే ఇండస్ట్రీ నుండి కనుమరుగు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీను వైట్ల వరుసగా నాలుగు సినిమాలు విఫలం కావడంతో రేసులో వెనుకబడ్డారు. దీనితో కొంచెం అవకాశాలు సైతం తగ్గుముఖం పట్టాయి. కాగా శ్రీను వైట్ల కొన్ని స్క్రిప్ట్స్ సిద్ధం చేసుకొని హీరో కోసం వెతుకుతున్నారట. తన స్క్రిప్ట్ ఎవరైనా ఒకే చేస్తే మూవీ మొదలుపడదామనే ప్రయత్నంలో ఆయన ఉన్నట్లు సమాచారం.

ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా శ్రీను వైట్ల ఓ కథ నేరేట్ చేశారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా ఉన్న హీరోకు ఇలాంటి పరిస్థితి రావడం కొంచెం విచారించ దగ్గ విషయమే. ఎన్టీఆర్ తో ఆయన చేసిన బాద్షా చిత్రం తరువాత శ్రీను వైట్ల నాలుగు సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని పరాజయం పాలయ్యాయి.

సంబంధిత సమాచారం :

X
More