హీరో, రైటర్ కు కృతఙ్ఞతలు చెప్పిన డాషింగ్ డైరెక్టర్ !

టెంపర్ సినిమా విడుదల అయ్యి మూడు ఏళ్ళు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో టెంపర్ సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ టెంపర్ సినిమా నా కెరిర్ లో గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రమని నటుడిగా ఎన్టీఆర్ కు రైటర్ వక్కంతం వంశి కి కృతఙ్ఞతలు తెలిపాడు.

ఎన్టీఆర్ నటించిన సినిమాలు రామయ్య వస్తావయ్య, రభస సినిమాలు సరిగ్గా ఆడలేదు ఆ సమయంలో టెంపర్ సినిమా వచ్చి ఎన్టీఆర్ కెరిర్ లో మంచి చిత్రంగా నిలవడమే కాక నటుడిగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ లో బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాకు అనుప్ రూబెన్స్అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. ఈ సినిమా తరువాత పూరి, ఎన్టీఆర్ సినిమా చేద్దామనుకున్న కుదరలేదు.