డిస్కో రాజా ఫస్ట్ డే కలెక్షన్స్ !

Published on Jan 25, 2020 1:04 pm IST

మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి.ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు డిస్కో రాజా 2.9 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టాడు. ఇది ఈ సినిమాలకు ప్రమాణాలకు చాలా తక్కువ. ఈ సినిమా ఏపి మరియు తెలంగాణలో 22 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అయితే రవితేజ తన ఆటిట్యూడ్ తో పాటు తన కామెడీ టైమింగ్ తో కూడా సినిమాలో బాగా ఆకట్టుకున్నాడు. కానీ దర్శకుడు ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోకపోవడం, పైగా డిస్కో రాజా క్యారెక్టరైజేషన్ అండ్ రవితేజ రెండు పాత్రల మధ్య ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. కాగా ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు.

సంబంధిత సమాచారం :

X
More