అభిమానులకు చిరు ఇచ్చే దీపావళి గిఫ్ట్ ఇదే!
Published on Oct 27, 2016 9:59 pm IST

khaidi150
మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తూ ‘ఖైదీ నెం. 150’ అనే సినిమాతో మెప్పించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైనా, అందులో చిరును పూర్తి స్థాయిలో చూసే అవకాశం మాత్రం అభిమానులకు దక్కలేదు. దీంతో ఈ దీపావళి కానుకగా మరోసారి చిరు లుక్‌ను విడుదల చేయాలన్న ఆలోచనతో టీమ్ చిరు లుక్‌ను రెడీ చేసింది.

దీపావళికి ఒకరోజు ముందుగానే అక్టోబర్ 29న సాయంత్రం ఈ కొత్త పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు టీమ్ స్పష్టం చేసింది. ఈ లుక్‌ను గతంలో వచ్చిన ఫస్ట్‌లుక్‌లా కాకుండా అదిరిపోయేలా డిజైన్ చేశారట. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఖైదీ నెం. 150ని చిరు తనయుడు రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook