యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ ‘డీజే’ !
Published on Nov 20, 2017 9:49 am IST

అల్లు అర్జున్ చివరగా చేసిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ రూ.70 కోట్ల షేర్ ను రాబట్టి ఆయన కెరీర్లోనే కలెక్షన్ల పరంగా రెండవ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం యొక్క హిందీ డబ్బింగ్ వెర్షన్ ను నిన్న సాయంత్రం టీవీల్లో ప్రీమియర్ల రూపంలో ప్రదర్శించడమేగాక యాట్యూబ్ ఛానెల్ లో కూడా విడుదలచేశారు. విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ఈ చిత్రానికి సుమారు 1.87మిలియన్ల వ్యూస్ మరియు 47 వేల లైక్స్ దక్కాయి.

గతంలో ‘సరైనోడు’ హిందీ వెర్షన్ ను రిలీజ్ చేసిన గోల్డ్ మైన్ టెలీ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేసింది. గతంలో ‘సరైనోడు’ చిత్రం హిందీ వెర్షన్ 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ‘డీజే’ సాధిస్తున్న ఈ సక్సెస్ తో బాలీవుడ్లో బన్నీ క్రేజ్ మరింతగా పెరగడమేగాక తెలుగు సినిమాలకున్న ఆదరణ కూడా రెట్టింపుకానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

 
Like us on Facebook