‘డీజే’ మలయాళం వెర్షన్ రిలీజ్ డేట్ !
Published on Jul 4, 2017 3:58 pm IST


అల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కలయికలో రూపొందిన సినిమా ‘దువ్వాడ జగన్నాథం’. గత నెల 23న విడుదలైన ఈ చిత్రం మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా భారీ స్థాయి ఓపెంనింగ్ రాబట్టి మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర టీమ్ యూఎస్ లో పర్యటిస్తూ సినిమా మైలేజ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉండగానే ఈ చిత్రం యొక్క మలయాళ వెర్షన్ విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతుండగా జూలై 14న కేరళలో సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కేరళలో బన్నీకి మంచి ఫ్యాన్ బేస్ ఉండటం వలన అక్కడ కూడా మంచి వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. అలాగే యూఎస్ పర్యటన నుండి తిరిగిరాగానే బన్నీ అండ్ టీమ కేరళలో కూడా విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించే యోచనలో ఉన్నారు.

 
Like us on Facebook