సిద్ధూ ని హర్ట్ చేసిన ఈ అంశం..ప్రెస్ నోట్ తో అందరికీ క్లారిటీ!

Published on Feb 4, 2022 1:18 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లో సీనియర్ స్టార్స్ సహా దర్శకులు మన తెలుగు సినిమాను మరింత స్థాయికి తీసుకెళ్తున్నారు. మరి వీరితో పాటుగా భవిష్యత్తు సినిమాను కూడా మరింత స్థాయిలో తీర్చి దిద్దే విధంగా ప్రస్తుత యంగ్ జెనరేషన్ కూడా ఎంతో ప్రామిసింగ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. మరి వీరిలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఒకడు. మరి తాను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “డీజే టిల్లు” రిలీజ్ కి రెడీగా ఉండగా రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

మరి ఈ ట్రైలర్ లాంచ్ లో తనకి ఒక అభ్యంతరకర ప్రశ్న ఎదురవ్వగా దానిపై ఒక వివరణను తన సోషల్ మీడియా ద్వారా అందించాడు. ఒక విషయం నన్ను బాగా హర్ట్ చేసింది అని చెప్తూ మా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఒక కించపరిచే ప్రశ్న నాకు ఎదురయ్యింది ఆ సమయంలో నేను ఇచ్చిన రెస్పాన్స్ కోసం చాలా మంది అడిగారు కానీ నేను ఆ టైం లో సింపుల్ గానే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా స్కిప్ చేసే ప్రయత్నం చేశాను.

కానీ ఇపుడు ఆ విషయంతో మరింత మంది ఇండస్ట్రీ లో ఉండే నటీనటులు కోసం, ఎవవేవో మాటలు మాట్లాడుతున్నారని తెలిసింది. మేము(యాక్టర్స్) కొన్ని సన్నిహిత సన్నివేశాల్లో చాలా కష్టంగా, ఇబ్బందిపడుతూనే యాక్ట్ చేస్తాం. ముఖ్యంగా ఇది ఆడవాళ్లకు కష్టంగా ఉంటుంది. సినిమా యూనిట్ అంతా ఆ సీన్ టైం లో ఉంటారు లైట్ పట్టుకున్న బాయ్ ఇలా అందరి ముందు అలాంటి సీన్స్ చెయ్యాలి అంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి?

ఈ విషయంలో మమ్మల్ని అర్ధం చేసుకొని మా వృత్తిని గౌరవిస్తారు అనుకుంటాము కానీ దాని కోసం కూడా ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. మేము ఏది చేసిన ఎంత చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు మాత్రం అది అంతా అర్ధం చేసుకోవాలని నేను నా డీజే టిల్లు సినిమా ప్రమోట్ చేసుకోడానికి మాత్రమే వచ్చానని మా సినిమాలో అన్ని హంగులూ ఉన్నాయి అందరికీ నచ్చుతుంది అని మళ్ళీ కలుద్దాం అని ఈ ప్రెస్ నోట్ తో క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :