100 కొట్ల క్లబ్ లో డాక్టర్ చిత్రం…నెల్సన్ దిలీప్ కుమార్ థాంక్స్..!

Published on Nov 3, 2021 8:15 am IST

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ల లో సినిమా విడుదల చేయడానికి ఆలోచిస్తున్న సమయం లో కొన్ని సినిమాలు వచ్చి సూపర్ హిట్ విజయాలను దక్కించుకున్నాయి. అయితే శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ చిత్రం మాత్రం అంతకు మించి విజయాన్ని సాధించింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం తాజాగా 100 కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ థాంక్స్ చెబుతూ ఒక లేఖను విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రాన్ని ఇంతటి ఘన విజయం సాధించడం పట్ల ప్రతి ఒక్కరికీ థాంక్స్ తెలిపారు. ఒక నిర్మాత గా, నటుడు గా నమ్మినందుకు శివ కార్తికేయన్ కి, ఎప్పుడు సపోర్ట్ గా ఉన్న అనిరుద్ రవి చందర్ కి, అదే విధంగా ప్రియాంక అరుల్ మోహన్, వినయ్, యోగి బాబు, మిలింద్ సోమన్, రెడిన్ కింగ్స్లెయ్, అర్చన, ఇలవరుసు, దీప, సునీల్, శివ తదితరులు లతో పాటుగా, సాంకేతిక నిపుణులకి కూడా స్పెషల్ థాంక్స్ తెలిపారు. డాక్టర్ మూవీ తెలుగు నాట కూడా థియేటర్ల లో విడుదల అయి మంచి విజయం సాధించింది.

సంబంధిత సమాచారం :