తన వ్యాక్సిన్ పై మహేష్ ట్వీట్ !

Published on Apr 25, 2021 11:00 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన వ్యాక్సిన్ గురించి తెలుపుతూ.. “నా కరోనా టీకా ఈ రోజు పూర్తయింది! దయచేసి మీరు కూడా పొందండి !! COVID-19 సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువుగా ఉంది. తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మే1వ తేదీ నుండి టీకా వేసుకోవడానికి అర్హులు. అందరూ టీకా వేయించుకోండి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు – పరుశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. వచ్చే షెడ్యూల్ కోసం ఈ సినిమా సెట్ నిర్మాణం జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. కరోనా లేకపోయి ఉండి ఉంటే.. ఈ పాటికే షూటింగ్ సగం పూర్తయిపోయేది.

సంబంధిత సమాచారం :