రేపు సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు డబుల్ ట్రీట్ లోడింగ్

Published on May 31, 2023 12:09 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నారు. కెరీర్ పరంగా ఇటీవల సర్కారు వారి పాట మూవీ సూపర్ సక్సెస్ తో డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్ మహేష్ తాజాగా SSMB 28 తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి అన్నివిధాలా సిద్ధం అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నుండి రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా సాయంత్రం 6 గం. 3 ని. లకు టైటిల్ తో పాటు ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ రిలీజ్ కానుంది.

అయితే విషయం మాస్ స్ట్రైక్ గ్లింప్స్ కి సంబంధించి ఇప్పటికే రెండు పోస్టర్స్ రిలీజ్ చేసి దానిపై సూపర్ ఫ్యాన్స్ లో ఎంతో హైప్ ఏర్పరిచిన మేకర్స్, రేపు ఉదయం 9 గం. లకు మరొక మాస్ పోస్టర్ లోడింగ్ అంటూ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు. మొత్తంగా రేపు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ లోడింగ్ అని తెలుస్తోంది. కాగా SSMB 28 మూవీ ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ ని రేపు కృష్ణ గారి మోసగాళ్లకు మోసగాడు మూవీ ప్రదర్శితం అవుతున్న ఎంపిక చేయబడ్డ థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. ఇక SSMB 28 మూవీ ని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 13, 2024 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :