‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రత్యేకత ఏంటో తెలుసా !
Published on Feb 22, 2018 4:52 pm IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ‘రంగస్థలం’ మార్చి 30న రిలీజ్ కానుంది. విడుదలకు ముందు ఆనవాయితీగా నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే వేడుక జరగబోయే వెన్యూను లాక్ చేసిన నిర్మాతలు వేడుకలో ప్రత్యేక హంగులు ఉండేలా చూస్తున్నారు.

ఈ హంగుల్లో భాగంగా చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు. స్వతాహాగా తన పాటలతో హుషారెత్తించే రాక్ స్టార్ దేవి లైవ్ పెర్ఫార్మెన్స్ ఫుల్ ఎనర్జీతో హోరెత్తడం ఖాయం. కనుక ఈ ఒక్క కార్యక్రమంతోనే మెగా అభిమానులకు ఈ వేడుక మంచి ఆహ్లాదంగా, వినోదభరితంగా ఉండనుంది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా సమంత చెర్రీకి జోడీగా నటించింది. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ఒక పాట బాగా సక్సెస్ కావడంతో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.

 
Like us on Facebook