దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ కి ఇంట్రస్టింగ్ టైటిల్

Published on Apr 10, 2022 4:35 pm IST

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు శ్రీ రామ నవమి సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు.

ఈ చిత్రానికి సీతా రామం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టైటిల్‌ను ప్రకటించడానికి చిత్ర బృందం వీడియో గ్లింప్స్ ను విడుదల చేసింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా నిర్మించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :