‘ఈగిల్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈగిల్’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Feb 28, 2024 9:17 PM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన లేటెస్ట్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఈగిల్ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు చేసారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీకి దవ్జంద్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ఈటివి విన్, అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్న సంగతి తెలిసిందే. విషయం ఏమిటంటే తాజాగా ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటిటి మాధ్యమాలు అమెజాన్ ప్రైమ్, ఈటివి విన్ ద్వారా ద్వారా ఈగిల్ మూవీ మార్చి 1 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయమై కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మరి ఈగిల్ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు