సీటు హీటెక్కుతుంది…బ్రెయిను హీటెక్కుతుంది… ఎన్టీఆర్ షో లో రామ్ చరణ్!

సీటు హీటెక్కుతుంది…బ్రెయిను హీటెక్కుతుంది… ఎన్టీఆర్ షో లో రామ్ చరణ్!

Published on Aug 19, 2021 4:52 PM IST

NTR 1

బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతుంది ఎవరు మీలో కోటీశ్వరులు. ఈ కార్యక్రమం కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 22 వ తేదీ నుండి మొదలు కానుంది. ఈ ఆగస్ట్ 22 వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రానున్నారు. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ను యాజమాన్యం తాజాగా విడుదల చేయడం జరిగింది.

రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ షో లో ఉత్సాహం గా కనిపిస్తున్నారు. కార్యక్రమం షురూ అయిన తర్వాత రామ్ చరణ్ సీటు హీటెక్కుతుంది, బ్రెయిను హీటెక్కుతుంది అంటూ ప్రోమో లో ఒక డైలాగ్ వస్తుంది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల ప్రోగ్రాం ప్రతి ఒక్కరికీ ఆసక్తి రేకెత్తించే విధంగా ఉందని చెప్పాలి. ఈ కార్యక్రమం రెగ్యులర్ గా ఆగస్ట్ 23 వ తేదీ నుండి ప్రసారం కానుంది. సోమవారం నుండి గురువారం వరకూ రాత్రి 8:30 గంటలకు ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు