ఎట్టకేలకు విడుదలవుతున్న గౌతమ్ మీనన్ చిత్రం !

Published on Feb 16, 2019 9:33 am IST

ప్రేమకథ చిత్రాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయినా డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ నటించిన చిత్రం ‘ఎన్నై నోకి పాయుమ్ తొట్ట’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆర్థిక సమస్యలు కారణంగా విడుదలకు నోచుకోలేదు. తాజాగా ఈచిత్రం విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయి సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ తో త్వరలోనే ఈచిత్రం విడుదల కానుంది.

మేఘాఆకాష్ కథానాయికగా నటించిన ఈచిత్రంలో శశి కుమార్ ముఖ్య పాత్రలో నటించారు. శివ సంగీతం అందించిన ఈచిత్రానికి గౌతమ్ మీనన్ నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :