Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : ఎవడు త‌క్కువ కాదు – అంతగా అలరించదు !

 Evadu Takkuva Kadu movie review

విడుదల తేదీ : మే 24, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2 /5

నటీనటులు : విక్రమ్ లగడపాటి, ప్రియా జైన్ ‘

దర్శకత్వం : రఘు జయ

నిర్మాత : శ్రీధర్ లగడపాటి

సంగీతం : హరి గౌరా

సినిమాటోగ్రఫర్ : దాము నర్రావుల

నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు విక్రమ్ లగడపాటిని ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మూవీ ‘”ఎవడు తక్కువకాడు” నలుగురు సామాన్య యువకులకు, ఓ బలమైన వ్యక్తికి మధ్య జరిగిన ఆధిపత్యపోరు అన్న పాయింట్ తో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందు కు రానుంది. మరి ఈ ఎలా ఉందో ఇప్పడు చూద్దాం.

కథ:

యుక్తవయసులో ఉన్న నాలుగు ఆనాధలు మధు(విక్రమ్),రాజా,బండా, మరియుచిన్ని మోండా మార్కెట్ లో కూలి పనులు చేస్తూ జీవనంసాగిస్తూ ఉంటారు. వీరితో ఎప్పటినుండో మంచి అనుబంధం ఉన్న పూర్ణక్క వీరి కష్టం చూసి జాలిపడి ఓ హోటల్ పెట్టిస్తుంది. ఓ హోటల్ కి మంచి పేరొచ్చి లాభాలతో వారి జీవితాలు మారనున్నాయన్న తరుణంలో ఆ మార్కెట్ ని శాసించే రాయుడు మరి వాడి గ్యాంగ్ తో సమస్యలు మొదలౌతాయి. దానితో వారి భవిష్యత్ ప్రశ్నర్ధకంలో పడుతుంది. మరి ఆ నలుగురు ఆనాధలు ఎవరి అండా లేకుండా బలవంతుడైన రాయుడిని ఎలా ఎదిరించారు. తమ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకున్నారు అన్నదే కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

నటనపరంగా మొదటి సినిమాలో పర్వాలేదు అనిపించిన లగడపాటి విక్రమ్ డాన్స్ లు విరదీశాడు. విక్రమ్ స్నేహితులుగా చేసిన ముగ్గురు టీనేజర్స్ తమ పరిధిలో చక్కగా నటించారు. ఈ నలుగురు మిత్రుల మధ్యలో నడిచే కొన్ని సంఘటనలు సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. ప్రియాంక జైన్ స్కూల్ గర్ల్ లా చాలా క్యూట్ గా ఉంది. పూర్ణక్క పాత్ర చేసిన మహిళ భావోద్వేగ సన్నివేశాలలో చాలా చక్కగా నటించింది. నలుగురు టీనేజర్స్ టూ పాటు నటించిన మరో టీనేజ్ గర్ల్ పాత్రలో నటించిన అమ్మాయి పర్వాలేదనిపించింది.సినిమాలో అక్కడక్కడా వచ్చే కమెడియన్ రఘు హాస్య సన్నివేశాలు బాగానే నవ్వించాయి. సినిమా చివర్లో టైటిల్స్ పడేటప్పుడు వచ్చే విక్రమ్ స్పెషల్ సాంగ్ బాగుంది.

మైనస్ పాయింట్స్:

సినిమా ప్రారంభంలో వచ్చే సన్నివేశాలలతో మూవీ పై అంచనాలు పెంచేసిన డైరెక్టర్, కథ మోండా మార్కెట్ కి షిఫ్ట్ ఐయ్యాక పట్టుకోల్పోతుంది. ఇంటర్వల్ కి ముందు వచ్చే , ఈ నాలుగు ఆనాధలు కష్టాలు పడే సన్నివేశాలు ఛత్రపతి సినిమాలోని సన్నివేశాల్ని తలపిస్తాయి. అనవసర సన్నివేశాలు కథలో చొప్పించి, ప్రేక్షకుడికి విసుగు కలిగేలా చేశారు. ఒక తరుణంలో సినిమా సిరీయస్ నెస్ కోల్పోయి చిన్నపిల్ల సినిమాలా అనిపిస్తుంది. తమిళ మూవీ కావడంతో దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసినా, తమిళ్ ఫ్లేవర్ సినిమాను వదిలిపోలేదు.
టెక్నికల్ విభాగం: కథ కొత్తది కాకపోయినాకూడా దర్శకుడు రఘు జయ స్క్రీన్ ప్లే పై ద్రుష్టి పెట్టాల్సింది. ఈయన సినిమా తీసిన తీరు ఎప్పుడో పాత సినిమా ఫార్మాట్లో ఉంది. ఎడిటింగ్ అనుకున్నంతగా లేదు, సినిమాలో దాదాపు 15 నిమిషాల అనవసర సన్నివేశాలున్నాయి. సినిమాలో కోరియోగ్రఫీ బాగుంది.

తీర్పు:

మొత్తంగా చెప్పాలంటే నలుగురు యువకులు అస్తిత్వం కోసం చేసేపోరాటమే “ఎవడు తక్కువకాడు” ఎంచుకున్న పాయింట్ మంచిదైనా దాన్ని ప్రెసెంట్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ ఐయ్యారు. రొటీన్ పాత కాలపు సన్నివేశాలు విసిగించేస్తాయి. చూడాలనుకుంటే సాహసమే…!

123telugu.com Rating : 2 /5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :