కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 నుంచి ఎవరితో పయనం సాంగ్ రిలీజ్!

కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 నుంచి ఎవరితో పయనం సాంగ్ రిలీజ్!

Published on Mar 27, 2024 9:33 AM IST

కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి ఎవరితో పయనం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. ఎవరితో పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మోక్టైల్, లవ్ మోక్టైల్ 2 చిత్రాలతో కన్నడ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ, మన ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ, కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. డార్లింగ్ కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరోగా మంచి సినిమాల్లో నటించాడు. అతను దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కి సంబంధించిన పాటను నేడు విడుదల చేసాం. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ ప్రమోషన్ ఆక్టివిటీస్ తో గ్రాండ్ గా మీ ముందుకు వస్తాం. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా అలాగే కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. కథలో శివరాజ్ కుమార్ గారి వేద సినిమాకి తెలుగు ప్రేక్షకులు హిట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇ లవ్ మోక్టెల్ 2 సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

డార్లింగ్ కృష్ణ, మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ లు నటించిన ఈ చిత్రానికి నిర్మాణం కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్, నిర్మాత ఎం వి ఆర్ కృష్ణ, మ్యూజిక్ నకుల్ అభయాన్కర్, డిఓపి మరియు ఎడిటర్ శ్రీ క్రేజీ మైండ్స్, కథ మరియు దర్శకత్వం డార్లింగ్ కృష్ణ, పి ఆర్ ఓ మధు VR లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు