‘ఒడిస్సి’ ఉన్నా ఈ వీకెండ్ కూడా అయ్యగారిదే!

‘ఒడిస్సి’ ఉన్నా ఈ వీకెండ్ కూడా అయ్యగారిదే!

Published on Jul 17, 2026 5:11 PM IST

తెలుగు సినిమా రీసెంట్ గా జూన్ రిలీజ్ పెద్ది నుంచి మొన్న లెనిన్ వరకు వరుస సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే గత వారం వచ్చిన అఖిల్ లెనిన్ సినిమా మంచి టాక్ అందుకొని మొదటి వారం రన్ ని సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ నెక్స్ట్ వీక్ సినిమాలు కూడా లేవు లెనిన్ కి మంచి వసూళ్లు ఇవ్వండి అని నిర్మాత నాగవంశీ చెప్పడం ఆసక్తిగా మారింది.

అయితే ఈ వారం పలు సినిమాలు ఉన్నాయి. ఇండియన్ ఆడియెన్స్, తెలుగు ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన హాలీవుడ్ సినిమా ‘ఒడిస్సి’ తో పాటుగా అరడజను సినిమాలు ఈ వారం థియేటర్స్ లోకి వచ్చాయి. అయినప్పటికీ లీడ్ అయ్యగారికే ఉండొచ్చని చెప్పాలి. ఒడిస్సి మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ రూరల్ మాస్ ఏరియాస్ వంటి చోట్ల అలాంటి సినిమాలు చూసే ఛాన్స్ లేదు.

అలాగే మిగతా సినిమాల టాక్ కూడా పెద్దగా ఏమి లేదు, కొన్నైతే వచ్చినట్టుగా కూడా చాలామందికి తెలీదు. సో ఈ వారం కూడా లెనిన్ దే అని చెప్పొచ్చు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని ఏరియాస్ లో లెనిన్ కి మంచి ఆదరణ లభించింది. ఈ వీకెండ్ కి మళ్ళీ ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లెనిన్ కి ఈ వారాంతం కూడా కలిసొస్తుంది అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు