హుదూద్ బాధితులను ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు వచ్చి ‘వీ లవ్ వైజాగ్’ వేడుకని నిర్వహిస్తున్నారు. సుమారు 13 గంటల పాటు కంటిన్యూగా జరిగే ఈ లైవ్ ప్రోగ్రాంకి టాలీవుడ్ లోని అందరు స్టార్స్ హాజరు కావడమే కాకుండా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.
ఇదిలా ఉంటే ఈ టాలీవుడ్ స్టార్స్ కి సపోర్ట్ గా తమిళ చిత్ర పరిశ్రమ హీరోలు కూడా ముందుకు వచ్చి ఈ వేడుకలో పాల్గొననున్నారు. తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న సూర్య, కార్తీలు ఈ వేడుకకి హాజరు కానున్నారు. ఇప్పటికే మన చిత్ర మండలి వారు సూర్య, కార్తీని ఈ వేడుకకి రమ్మని అడగడం, వాళ్ళు తప్పకుండా వస్తాము అని మాటివ్వడమే కాకుండా, పెర్ఫార్మన్స్ చెయ్యడానికి కూడా వారు సముఖత చూపినట్లు సమాచారం. దీన్నిబట్టి ‘వీ లవ్ వైజాగ్’ వేడుకలో అన్నదమ్ములైన సూర్య – కార్తిల లైవ్ పెర్ఫార్మన్స్ చూడవచ్చు.
తెలుగు ఇండస్ట్రీకి చెందిన వారు చేస్తున్న ఈ ఈవెంట్ కి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కూడా మీకు మేమున్నాం అంటూ తమిళ హీరోలు సపోర్ట్ చేయడం ఎంతో శుభసూచకం. ఈ వేడుక నవంబర్ 9న హైదరబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది.
‘వీ లవ్ వైజాగ్’ వేడుకకి సంబందించిన మరిన్ని విశేషాల కోసం 123telugu.com ని విజిట్ చేస్తూ ఉండండి.


