అల్టిమేట్ ఫన్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి #90’s టీమ్!

అల్టిమేట్ ఫన్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి #90’s టీమ్!

Published on Jan 22, 2024 4:05 PM IST


ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటున్న కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ కార్యక్రమం కి ప్రముఖ #90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ టీమ్ గెస్ట్ గా విచ్చేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ను తాజాగా విడుదల చేసారు మల్లెమాల టీవీ టీమ్. రిలీజైన ప్రోమో అల్టిమేట్ ఫన్ తో నిండి ఉంది.

ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ లో నటించిన శివాజీ రాజా ఎక్స్ట్రా జబర్దస్త్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఇప్పటి వరకూ కచ్చితంగా ఒక్క ఎపిసోడ్ ను కూడా మిస్ కాలేదు అంటూ చెప్పుకొచ్చారు. శివాజీ తో పాటుగా, మౌళి, వసంతిక, రోహన్ రాయ్ లు షో కి వచ్చారు. మౌళి సలార్ లోని ప్రభాస్ డైలాగ్ ను చెప్పి ఆకట్టుకున్నాడు. రోహన్ రాయ్ కామెడీ టైమింగ్ బాగుంది. ఆటో రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను ల స్కిట్ మంచి ఫన్ మూమెంట్స్ తో నిండి ఉంది. కుష్బూ, కృష్ణ భగవాన్ లు జడ్జి లుగా వ్యవహరిస్తున్న ఈ షో కి రష్మీ యాంకర్ గా ఉన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జనవరి 26, 2024 న ఈటీవీ లో ప్రసారం కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు