బ్యాంకాక్ షెడ్యూల్ కు రెడీ అవుతున్న’ఎఫ్ 2′ టీం !

Published on Oct 10, 2018 2:00 am IST

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ , యువ హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నమల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఇటీవల ఈచిత్రం యొక్క లాంగ్ షెడ్యూల్ యూరప్ లోముగిసింది. ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ తాజా షెడ్యూల్ కోసం బ్యాంకాక్ కు వెళ్లనున్నారు. అక్టోబర్ 15నుండి అక్కడే జరిగే ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆతరువాత వచ్చే నెలలో హైదరాబాద్లో జరిగే షెడ్యూల్ తో ఈ చిత్ర షూటింగ్ పూర్తికానుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రంలో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్నఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికానుకగా జనవరి 12న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :