ఎఫ్ 2 టీజర్ కు సూపర్ రెస్పాన్స్ !

ఎఫ్ 2 టీజర్ కు సూపర్ రెస్పాన్స్ !

Published on Dec 13, 2018 4:30 PM IST


అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ , యువ హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘ఎఫ్ 2’ చిత్రం యొక్క టీజర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లో 40లక్షలకు పైగా వ్యూస్ ను రాబట్టి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. టీజర్ లో వెంకీ కామిక్ టైమింగ్ హైలైట్ అవ్వగా పెళ్ళికి ముందు , పెళ్ళికి తరువాత అనే కాన్సెప్ట్ తో హ్యాట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈచిత్రంలో వెంకీ సరసన తమన్నా అలాగే వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు