ఎఫ్ 2 టీజర్ అప్డేట్ !

Published on Dec 6, 2018 10:52 am IST

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఒక్క సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను వెంకీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ టీజర్ అంత ఫుల్ ఫన్నీ గా వుండనుందట. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈచిత్రంలో వెంకీ సరసన తమన్నా అలాగే వరుణ్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :