రేపటి నుండి ‘ఎఫ్ 2’ అప్డేట్స్ !

Published on Dec 4, 2018 10:31 am IST

అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ ,మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగుతుంది. ఇక ఈచిత్రం యొక్క అప్డేట్స్ ను రేపటి నుండి రివీల్ చేయనున్నారు. దాంట్లో భాగంగా రేపు ఈచిత్రం నుండి ఇంట్రస్టింగ్ అప్డేట్ వెలుబడనుంది. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నఈచిత్రంలో తమన్నా , మెహ్రీన్ హీరోయిన్లు గా నటిస్తుండగా హ్యాట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :