ఓవర్సీస్‌లో “ఎఫ్3” వసూళ్ల ప్రభంజనం..!

Published on Jun 1, 2022 1:00 am IST

విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 3’ సినిమా ఈ నెల 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను రాబట్టుకుంటుంది. అలాగే ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను రాబట్టుకుంటుంది.

అయితే ఈ సినిమా ఫస్ట్ బ్రేక్ ఈవెన్ కూడా యూఎస్ఎలోనే జరిగింది. 1.1 మిలియన్ ప్లస్ డాలర్స్‌తో వసూళ్ల ప్రభంజనం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓవర్సీస్ ఆడియన్స్‌కి ఎఫ్3 చిత్ర బృందం థ్యాంక్స్ చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :