రాంచరణ్-శంకర్ కాంబోకు పుష్ప విలన్..!

Published on Aug 19, 2021 12:12 am IST

మలయాళంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్‌కు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప’ సినిమాలో ఫహద్ ఫాజిల్‌ మెయిన్ విలన్‌గా నటిస్తూ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే తెలుగులో ఫహద్‌కి మరో భారీ ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మెగా హీరో రామ్ చరణ్-శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియన్ సినిమాలో విలన్ పాత్ర కోసం చిత్ర బృందం ఫహద్‌ను అడుగుతున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఫహద్ కూడా దీనికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇకపోతే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టుకోనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :