“హను మాన్” : ఓటిటి అప్డేట్ తో బాగా డిజప్పాయింట్ అయ్యిన ఫ్యాన్స్

“హను మాన్” : ఓటిటి అప్డేట్ తో బాగా డిజప్పాయింట్ అయ్యిన ఫ్యాన్స్

Published on Mar 15, 2024 8:04 AM IST


ప్రస్తుతం ఓటిటి వీక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం “హను మాన్” (Hanu Man OTT Release) అనే చెప్పాలి. థియేటర్స్ లో భారీ వసూళ్లతో దుమ్ము లేపిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ చాలా ఆసక్తిగా మారింది.

అయితే ఈ సినిమాని ప్రముఖ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓ పక్క హిందీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ కాగా తెలుగు ఆడియెన్స్ కి ఇంకా ఎదురు చూపులు తప్పలేదు. అయితే నిన్ననే ఎట్టకేలకి జీ 5 వారు రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు. కానీ దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు బాగా డిజప్పాయింట్ అయ్యారు.

ఆల్రెడీ చాలా వెయిట్ చేస్తుంటే తీరా డేట్ ఇస్తారు అనుకునే సమయంలో ఇంకా అతి త్వరలో అంటూ మెన్షన్ చేయడం బాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్క హను మాన్ క్రేజ్ ని అయితే మేకర్స్ మరింత సస్పెన్స్ గా మార్చుకుంటున్నారు. ఇక ఈరోజు అయినా ఈ అవైటెడ్ డేట్ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు