రవితేజ “రావణాసుర” టీజర్ పై నెలకొన్న ఆసక్తి!

Published on Mar 3, 2023 7:00 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్ లపై అభిషేక్ నామా, రవితేజ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో లు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సూపర్ ఫాం లో ఉన్న రవితేజ, రావణాసుర చిత్రం తో మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను మేకర్స్ మార్చ్ 6 న ఉదయం 10:08 గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే టీజర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుండి రవితేజ ఎలా ఉండబోతున్నారు అనే దానికి టీజర్ సమాధానం కానుంది. ఈ చిత్రం లో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తుండగా, అను ఇమ్మన్యూయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :