ఇంకొద్ది గంటల్లో ‘జవాన్ ఫస్ట్ లుక్ !

21st, June 2017 - 12:55:21 PM


మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. రచయిత బివిఎస్ఎన్ రవి దర్శకుడిగా మారుతూ ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా మొదలుపెట్టింది. అంతేకాక చిత్ర టీమ్ ప్రచార కార్యక్రమాల్ని కూడా ముమ్మరం చేసింది.

ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఫస్ట్ లుక్ ను హీరో ధరమ్ తేజ్ స్వయంగా రివీల్ చేయనున్నారు. ‘తిక్క, విన్నర్’ వంటి రెండు భారీ పరాజయాల తర్వాత చేస్తున్న ఈ సినిమాపైనా తేజ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తునం ఈ సినిమాలో ధరమ్ తేజ్ దేశమా, కుటుంబమా అనే సంఘర్షణను ఎదుర్కునే ఒక భాద్యత గల యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేయనున్నారు.