రికార్డు స్థాయిలో ఫిదా మొదటి రోజు కలెక్షన్స్!

22nd, July 2017 - 04:40:34 PM


దిల్ రాజు బ్యానర్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఫిదా సినిమా అప్పుడే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో పాటు మొదటి రోజు చిన్న చిత్రాల్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకొన్నట్లు తెలుస్తుంది. ఇండియన్, ఓవర్సీస్ లో కలిపి మొదటి రోజు 3.7 కోట్లు ఫిదా మూవీ వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఫిదా సినిమాతో హీరోయిన్ సాయి పల్లవి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా తెలుగు ఇండస్ట్రీలో ఫ్రేమ్ లోకి వచ్చేసింది. ఈ సినిమాకి సాయి పల్లవి అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో పాటు వరుణ్ తేజ్ యాక్టింగ్, శేఖర్ కమ్ముల మేకింగ్ సినిమాని అంచనాలకి మించి ఆడియన్స్ క్రేజ్ పెంచేసింది.