ఎన్నాళ్లకు మళ్ళీ “2.0” విడుదల.!

Published on Aug 24, 2019 10:00 pm IST

తమిళ్ సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా ఇండియన్ జేమ్స్ కేమెరూన్ గా పేరుగాంచిన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన భారీ బడ్జెట్ విజువల్ వండర్ ట్రీట్ “2.0”. అంతకు ముందు రజిని మరియు శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన “రోబో” చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.అయితే ఇంకా ఊహించిన స్థాయిలో అయితే విజయాన్ని అందుకోకపోయినా ఒక విజువల్ ట్రీట్ గా మాత్రం ఆడియెన్స్ ను అలరించింది.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదివేల థియేటర్లలో విడుదల అయ్యిన ఈ చిత్రాన్ని తర్వాత మళ్ళీ చైనా మార్కెట్ లో కూడా భారీగా విడుదల చేసందుకు సన్నాహాలు చేసి డేట్ కూడా ఫిక్స్ చేసారు.కానీ కొన్ని కారణాల చేత ఈ చిత్రం చైనా మార్కెట్ లో అనుకున్న సమయానికి విడుదల కాలేదు.ఒక్క చైనాలోనే అప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా విడుదల కాని రేంజ్ లో మొత్తం పదివేలు థియేటర్లకు పైగా అందులోను మొత్తం 56000 స్క్రీన్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు.వాటిలో ఒక్క 3D వెర్షన్ లోనే 47000 స్క్రీన్లలో విడుదల చేస్తున్నామని తెలిపారు.

కానీ రోజులు గడుస్తున్నా సరే అక్కడ ఈ చిత్రం విడుదల అయ్యే సూచనలు కనిపించలేదు.కానీ ఈ చిత్రం అక్కడ విడుదలకు సిద్ధంగా ఉందని ఈ సినిమాలో లేడీ రోబోగా నటించిన బ్యూటిఫుల్ హీరోయిన్ అమీ జాక్సన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు.చిట్టి ఈ సెప్టెంబర్ 6వ తారీఖున చైనా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నారని తెలియజేసారు.ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 800 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ చిత్రం మరి చైనా మార్కెట్ లో ఎంత రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :