ఇన్నాళ్లకు అంజలి సినిమాకి మోక్షం కలిగేలా ఉంది !
Published on Nov 19, 2016 11:20 am IST

anjali
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, గీతాంజలి’ వంటి సినిమాలతో మంచి పాపులారిటీ సొంత చేసుకున్న హీరోయిన్ అంజలి. అలా సక్సెస్ లు సాదిస్తున్న సమయంలో ఆమె ‘చిత్రాంగధ’ పేరుతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. చాలా భాగం విదేశాల్లో, హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పూర్తై చాలా కాలమైంది. ఆయినా కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోని ఆ చిత్రానికిప్పుడు మోక్షం కలిగేలా కనిపిస్తోంది.

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ‘అభిషేక్ పిక్చర్స్’ అధినేత అభిషేక్ నామా తాజాగా ఈ కథ, కథనాలు బాగున్నాయని, ప్రేక్షకులను ఆకట్టుకునే విషయం అందులో ఉందని ఆ చిత్రాన్ని రిలీజ్ చేసే భాధ్యతను తీసుకున్నారు. ఈ సినిమాని డిసెంబర్ ఆఖరులో లేదా జనవరి మొదట్లో విడుదల చేసే ఛాన్స్ ఉంది. మొదట తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేద్దామనుకున్నా తమిళ వర్షన్ ఇంకా పూర్తిగా సిద్ద కాకపోవడంతో ముందు రెడీగా ఉన్న తెలుగు వర్షన్ ను విడుదల చేయనున్నారు.

 
Like us on Facebook