ఫైనల్ గా ఓటిటిలో వచ్చేసిన అవైటెడ్ “కాంతారా”.!

ఫైనల్ గా ఓటిటిలో వచ్చేసిన అవైటెడ్ “కాంతారా”.!

Published on Nov 24, 2022 8:00 AM IST

లేటెస్ట్ గా సౌత్ ఇండియా సినిమా సహా పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం “కాంతారా” కోసం అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ తెలుగు మరియు హిందీ భాషల్లో భారీ వసూళ్లు అందుకొని ఈ చిత్రం రికార్డు 400 కోట్లకి చేరుకుంది.

ఇక ఈ వసూళ్ల తర్వాత ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై గత కొంత కాలం నుంచి మంచి బజ్ వినిపిస్తుండగా నిన్ననే ప్రైమ్ వీడియో వారు ఈ సినిమా స్ట్రీమింగ్ ని అయితే కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ అవైటెడ్ చిత్రం అయితే ఇప్పుడు ఫైనల్ గా సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

దీనితో ఆల్రెడీ ఇప్పుడు సినిమా టాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా నిలవగా ఈ చిత్రం ఓటిటి భారీ రెస్పాన్స్ కొల్లగొడుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా సప్తమి గౌడ నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు