మోస్ట్ అవైటెడ్ “లవ్ స్టోరీ” రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Aug 18, 2021 11:13 am IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న పలు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో అక్కినేని యువ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం “లవ్ స్టోరీ” కూడా ఒకటి. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ కోసం టాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది ఈరోజు మేకర్స్ ప్రకటిస్తామని తెలిపారు.

మరి దానిని ఇప్పుడు మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. ముందు నుంచి వినిపిస్తున్న బజ్ ప్రకారమే ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసారు. దీనితో ఈ ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రంపై ఒక తుది క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. ఇప్పటికే పవన్ సి హెచ్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే అతి పెద్ద హిట్ కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి సిల్వర్ స్క్రీన్ ఫీస్ట్ కి ఎలాగో డేట్ ఫిక్స్ అయ్యిపోయింది కాబట్టి ఇక సిద్ధం కండి..

సంబంధిత సమాచారం :