ఎట్టకేలకు కమల్ షురూ చేశాడు.

Published on Aug 26, 2019 2:58 pm IST

ఎట్టకేలకు భారతీయుడు 2 మూవీ షూటింగ్ కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా చేస్తున్న ప్రియా భవాని శంకర్ ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారట. కమల్ హాసన్, ప్రియా పై వచ్చే సన్నివేశాలు దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటిస్తున్న ఐశ్వర్యా రాజేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి.

భారతీయుడు2 చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ సమకుసరుస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.భారతీయుడు 2 ఎప్పుడో చిత్రీకరణ మొదలుకావల్సి ఉండగా బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆలస్యం అయినది .

సంబంధిత సమాచారం :