ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “సేవ్ ది టైగర్స్ 2”

ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “సేవ్ ది టైగర్స్ 2”

Published on Mar 2, 2024 12:07 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, చైతన్య కృష్ణ అలాగే అభినవ్ గోమఠం మెయిన్ లీడ్ లలో దర్శకుడు అరుణ్ కొత్తపల్లి తెరకెక్కించిన ఓటిటి హిట్ సిరీస్ “సేవ్ ది టైగర్స్” మరి డిస్నీ + హాట్ స్టార్ లో హాట్ స్టార్ స్పెషల్స్ లో భాగంగా స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది.

ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో ఇది ఆకట్టుకోగా దీని సీక్వెల్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ సీక్వెల్ పై క్లారిటీ వచ్చేసింది. మేకర్స్ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ తో మరిన్ని హిలేరియస్ సీన్స్ తో ఈసారి మరింత కామెడీ ని అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఇక మెయిన్ లీడ్ ట్రాక్ లు అయితే మరింత హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

మరి ఈ అవైటెడ్ సిరీస్ ని ఈ మార్చ్ 15 నుంచి అయితే హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయడానికి తీసుకొస్తున్నట్టుగా డేట్ ని అయితే ఇప్పుడు లాక్ చేసేసారు. ఇక ఈ అవైటెడ్ సిరీస్ కి అజయ్ అరసాడా సంగీతం అందించగా మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం లు నిర్మాణం వహించారు. అలాగే ప్రస్తుతం సీజన్ 1 హాట్ స్టార్ లో ఈ మార్చ్ 10 వరకు ఫ్రీ గా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు