ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన హృతిక్ రోషన్ ‘ఫైటర్’

ఫైనల్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన హృతిక్ రోషన్ ‘ఫైటర్’

Published on Mar 21, 2024 7:31 AM IST


బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు సిద్దార్ధ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఏరియల్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ ఫైటర్. దీనిని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించగా విశాల్ శేఖర్ సంగీతం అందించారు.

ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి రూ. 350 కోట్ల గ్రాస్ తో మంచి సక్సెస్ సాధించిన ఈ మూవీ నేడు కొద్దిసేపటి క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా హిందీ భాషలో ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఫైటర్ లో స్క్వాడ్రన్ లీడర్ పాటీ పాత్రలో మరొక్కసారి తనదైన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అదరగొట్టి ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించారు హృతిక్. మరి ఫైటర్ మూవీ ఓటిటిలో ఎంతమేర రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు