ప్రియా వారియర్ కోరికైతే తీరింది..మరి అదృష్టం ఎలా ఉందో

Published on Jun 23, 2019 11:00 pm IST

దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమనే. ఎందుకంటే ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి. అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న. ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది. వీళ్ళ మాదిరిగానే వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ సైతం మలయాళంలో మొదటి సినిమా ‘ఓరు అదార్ లవ్’ హిట్ కావడంతో తెలుగుపై దృష్టి పెట్టింది.

మొదట్లో ఆమెకు కొన్ని ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడం, తెలుగులోకి ‘లవర్స్ డే’ పేరుతో డబ్ అయిన ‘ఓరు అదార్ లవ్’ ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలకు బ్రేకులు పడ్డాయి. అప్పటివరకు ఉన్న ఆఫర్లు కాస్త పోయాయి. దీంతో ఆమెకు ఎదురుచూపులు తప్పలేదు. ఫలితంగా ఇన్నాళ్లకు నితిన్ కొత్త సినిమాలో ఆమెకు రెండో కథానాయకిగా ఛాన్స్ దొరికింది. ఈ అవకాశం ఆమెకు గొప్పదనే అనాలి. ఇందులో తన నటనతో ఆమె మెప్పించగలిగితే అవకాశాలు తప్పకుండా పెరుగుతాయి. చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన కథానాయిక.

సంబంధిత సమాచారం :

More