ఓటిటి : ఫైనల్ గా హిందీలో రవితేజ, నాగ చైతన్య రీసెంట్ చిత్రాలు

ఓటిటి : ఫైనల్ గా హిందీలో రవితేజ, నాగ చైతన్య రీసెంట్ చిత్రాలు

Published on Feb 27, 2024 9:36 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ పవర్ హౌస్ హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ అలాగే యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యలు ఇప్పుడు తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి రవితేజ లేటెస్ట్ గా నటించిన “ఈగల్” తో పలకరించగా చైతు అయితే బిగ్ స్క్రీన్స్ పై “కస్టడీ” తో పలకరిచాడు. అయితే ఈగల్ కి ముందు రవితేజ నటించిన భారీ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం తెలిసిందే. అయితే ఇంట్రెస్టింగ్ గా చైతు కస్టడీ, అలాగే రవితేజ టైగర్ నాగేశ్వరరావు రెండు సినిమాలు హిందీలో ఇంకా స్ట్రీమింగ్ కి రాలేదు.

ఇక ఫైనల్ గా ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చాయి. మరి టైగర్ నాగేశ్వరరావు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాగా కస్టడీ చిత్రం కూడా ఇందులోనే వచ్చేసింది. మరి హిందీ వెర్షన్ కోసం చూస్తున్న వారు అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాలని వీక్షించవచ్చు. ఇక కస్టడీ చిత్రాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించగా టైగర్ నాగేశ్వరావు చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు వంశీ తెరకెక్కించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు