ఫైనల్ గా సల్మాన్ భారీ చిత్రం ఇలా విడుదల.!

Published on Apr 21, 2021 4:00 pm IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే”. మల్టీ టాలెంటెడ్ దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ అనూహ్యంగా కరోనా మళ్ళీ అడ్డంకిగా మారింది. అయితే మరి ఈ భారీ చిత్రం విడుదల పై గత కొన్నాళ్ల నుంచి సస్పెన్సు కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఆ సస్పెన్సుకు తెర దించారు.

ఎట్టకేలకు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని వచ్చే మే 13న అటు థియేటర్స్ లోనూ అలాగే ఓటిటి లో కూడ నేరుగా విడుదల చెయ్యాలని కన్ఫర్మ్ చేసారు. అయితే ఓటిటిలో జీ ప్లెక్స్ లోని పే పర్ వ్యూ గా కొంత రుసుము చెల్లించి థియేటర్స్ కు వెళ్లి రిస్క్ తీసుకోము అన్నవారు చూసేలా తీసుకొచ్చారు. మొత్తానికి మాత్రం సల్లూ భాయ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఇలా రెండు రకాలుగా ఏకకాలంలో విడుదలకు రెడీ అయ్యింది.

సంబంధిత సమాచారం :