నితిన్ సినిమాపై సస్పెన్స్ వీడింది..!

Published on Sep 19, 2020 5:10 pm IST

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా “భీష్మ”తో మంచి సాలిడ్ కం బ్యాక్ హిట్ ను అందుకున్నాడు. దీనితో అదే జోరును కొనసాగించాలని మరో రెండు ప్రాజెక్టులను లైన్ లో పెట్టేసారు. అలా సెట్ చేసిన వాటిలో బాలీవుడ్ హిట్ చిత్రం “అంధధూన్ రీమేక్ కూడా ఒకటి. మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించి చాలా కాలం నుంచి ఒక సస్పెన్స్ నడుస్తూనే ఉంది.

ఈ చిత్రంలో అతి కీలకమైన రోల్ అయినటువంటి టబు రోల్ కు చాలా మంది నటీమణుల పేర్లే వినిపిస్తూ వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఫైనల్ గా స్టార్ హీరోయిన్ తమన్నాను ఫిక్స్ చేసారు. అలాగే మరో అంశం కూడా ఇపుడు ఫైనలైజ్ అయ్యింది. గత కొంత కాలం నుంచి ఈ చిత్రానికి హీరోయిన్ గా లేటెస్ట్ హీరోయిన్ నభా నటేష్ పేరే వినిపించింది ఆ ఊహాగానాలకు నిజం చేస్తూనే ఆమెనే ఫిక్స్ చేసారు. మొత్తానికి చాలా కాలం నుంచి అలా సస్పెన్స్ గా కొనసాగుతూ వస్తున్న ఈ అంశాలు ఎట్టకేలకు క్లారిఫై అయ్యాయి.

సంబంధిత సమాచారం :

More