ఫైనల్ గా ఓటిటిలోకి వచ్చేసిన “టైగర్ నాగేశ్వరరావు” వినూత్న వెర్షన్

ఫైనల్ గా ఓటిటిలోకి వచ్చేసిన “టైగర్ నాగేశ్వరరావు” వినూత్న వెర్షన్

Published on May 23, 2024 8:00 PM IST

మాస్ మహా రాజ్ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ గా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు వంశీతో చేసిన భారీ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కూడా ఒకటి. మరి ఈ చిత్రం నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించగా డీసెంట్ హిట్ గా ఇది నిలిచింది. ఇక ఈ చిత్రం రిలీజ్ సమయంలోనే మేకర్స్ ఈ సినిమాని పాన్ ఇండియా భాషలతో పాటుగా మరో ఇండియన్ భాషలో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అదే “ఇండియన్ సైన్ లాంగ్వేజ్”.

ఈ వినూత్న ప్రయత్నానికి అప్పుడు చిత్ర యూనిట్ పై మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సైన్ లాంగ్వేజ్ వెర్షన్ ఓటిటిలోకి రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా అన్ని భాషలు ఓటిటి హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే ఇప్పుడు ఇది కూడా అందుబాటులోకి వచ్చింది. మరి ఈ వెర్షన్ లో సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఓసారి ప్రైమ్ వీడియోలో చెక్ చేయొచ్చు. ఇక ఈ భారీ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ లు నటించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు