“రాధే శ్యామ్”..ఈ మూడు రోజులు కోసం భారీ సెట్టింగ్స్!

Published on Aug 20, 2021 9:00 am IST

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. మరి వేటలో ఆల్రెడీ తన షూట్ ని మోత్తం కంప్లీట్ చేసేసిన చిత్రం మాత్రం “రాధే శ్యామ్”. చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ లవ్ స్టోరీ తో వస్తున్న ప్రభాస్ దీనిపై భారీ స్థాయి అంచనాలు తీసుకొచ్చాడు.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్ర యూనిట్ మళ్ళీ షూట్ ని స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. అయితే ఈ షూట్ కి గాను మేజర్ నటులు అవసరం లేకుండా జస్ట్ టైటిల్ కార్డ్స్ కోసం ఈ షూట్ ని చేస్తున్నారని టాక్. అయితే ఇప్పటికే గండికోట ప్రాంతంలో భారీ సెట్టింగ్స్ వెయ్యడం మేకర్స్ స్టార్ట్ చేశారు.

ఇవన్నీ కేవలం టైటిల్ అండ్ ఎండ్ కార్డ్స్ షూటింగ్ కోసమే అట. మొత్తం మూడు రోజులు పాటుగా ఈ సెట్టింగ్స్ లోనే షూటింగ్ ని జరపనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :