ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా గ్యాప్ తీసుకొని కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగర్తండా ను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘వాల్మీకి’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసినిమా షూటింగ్ ఈనెల 21 నుండి ప్రారంభం కానుంది. సుమారు వారం రోజుల పాటు జరుగునున్న ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ , తనికెళ్ల భరణి తోపాటు గబ్బర్ సింగ్ గ్యాంగ్ కూడా పాల్గొననున్నారు. ఇక ఈ చిత్రంలో బాబీ సింహ పోషించిన పాత్రలో వరుణ్ తేజ్ నటించనుండగా సిద్దార్థ పాత్రలో శ్రీ విష్ణు నటించనున్నాడు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈచిత్రాన్ని విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.


